పర్యాయ పదాలు. ఒకే అర్ధమునిచ్చు వివిధ పదములను పర్యాయ పదములు అంటారు. అంకురార్పణ - ఆరంభము, ప్రారంభము, శ్రీకారము, మొదలు, ఆముఖము, సమారంభము. అధికారి - అధినేత, దొర, పాలకుడు, అధిపతి, అధ్యక్షుడు. ఆచారము - సంప్రదాయము, ధర్మము, అనుష్ఠానము, మరియాద, పాడి. ఆజ్ఞ - ఉత్తరువు, సెలవు, ఆనతి, శాసనము, అనుమతి, ఆదేశము.
Comments
Post a Comment