పర్యాయ పదాలు.

 పర్యాయ పదాలు.

ఒకే అర్ధమునిచ్చు వివిధ పదములను పర్యాయ పదములు అంటారు.

అంకురార్పణ - ఆరంభము, ప్రారంభము, శ్రీకారము, మొదలు, ఆముఖము, సమారంభము.
అధికారి - అధినేత, దొర, పాలకుడు, అధిపతి, అధ్యక్షుడు.
ఆచారము - సంప్రదాయము, ధర్మము, అనుష్ఠానము, మరియాద, పాడి.
ఆజ్ఞ - ఉత్తరువు, సెలవు, ఆనతి, శాసనము, అనుమతి, ఆదేశము.

ఆపద - గండము, ఇడుము, కష్టము, క్లేశము, పీడ, ప్రమాదము, కీడు, చిక్కు.
ఆవు - మొదవు, కపిల, ధేనువు, సురభి, పావని, బహుళ, మాహేయ, గోవు, పయస్విని.
ఆశీర్వాదము - ఆశీస్సు, ఆశీర్వచనము, సంబోధన, ఆక్రందన.
ఇల్లు - గృహము, ధామము, ఆవాసము, ఆలయము, స్వగృహము, కొంప, భవనము.
ఈశానము - రుద్రభూమి, మరుభూమి, వసకాడు, ప్రేతవనము, పరేతభూమి.
ఉదాహరణము - నిరూపణము, ఉపవృత్తి, ప్రామాణ్యము, ఉదాహృతి.
ఉప్పు - లవణము, క్షారము, కటకము.
ఋషి - తాపసి, ముని, సాధువు, జడధారి, తపస్వి.
ఎల్లప్పుడు - సర్వదా, నిత్యము, కలకాలము, సతతము, అనవరతము, అహర్నిశము, ఎల్లకాలము.
ఏనుగు - ఇభము, హస్తి, సారంగము, గజము, కరేణువు, కుంజరము, దంతి, మాతంగము, వారణము, సింధువు.
ఓదార్పు - సాంత్వము, అనునయము, ఊరడింపు, లాలన, బుజ్జగింపు, ఉపశాంతి.
కట్నము - శుల్కము, వరదక్షిణ, అరణము, వీడు.
కడుపు - కుక్షి, ఉదరము, పొట్ట, కంజరము.
కన్ను - చక్షువు, అక్షిన, లోచనము, నయనము, ఈక్షణము, అవలోక్యము.
కర్పూరము - కప్రము, కుముదము, నెల, ముక్తాఫలము, హిమాంశువు, శ్వేతధామము.
కలువ - ఉత్పలము, కువలయము, పున్నాగము, తోవ, కపాలము.
కాంతి - వెలుగు, మినుకు, ప్రకాశము, ద్యుతి, ప్రతిభ, రవణము, రోచిస్సు.
కవచము - ఆయుక్తము, తొడుగు, వారణము, కవసము.
కాముకుడు - శృంగారి, కామాచారి, స్త్రీపరుడు, కామి, వలకాడు.
కాయ - కసురు, శలాటువు, పసరుకాయ.
కారణము - హేతువు, తర్కము, నిమిత్తము, మిష, సాకు, వంక, భంగి.
కీర్తి - ఖ్యాతి, ప్రతిష్ఠ, యశము, ప్రకాశము, ప్రశస్తి, నెగడ్త, పేరు.
కూతురు - అంగజ, కుమారి, తనయ, సుత, పుత్రిక, తనూజ.
కొడుకు - సుతుడు, నందనుడు, కుమారుడు, తనయుడు, అంగజుడు, పుత్రుడు, ఆత్మజుడు.
కోపము - క్రోధము, ఆగ్రహము, ఉద్రేకము, కినుక, అలుక, నెగులు, చిందు, రోషము.
క్రమము - అనుక్రమము, యధాక్రమము, సరలి, పదకము, తరువాయి.
క్షణము - లిప్త, మాత్ర, త్రుటి, ముహూర్తము.
గ్రంధము - పుస్తకము, వహి, పొత్తము, కితాబు.
చర్మము - తోలు, తాట, తొక్క, అజనము.
తండ్రి - జనకుడు, అయ్య, నాన్న, పిత, పితరుడు.
తామర - పద్మము, అంబుజము, అరవిందము, సరసిజము, సరోజిని, కంజాతము, రాజీవము.
త్రాడు - పాశము, చామము, రజ్జువు, బంధువు, వటము.
దేవాలయము - ఆలయము, నగరు, కోవెల, గుడి.
దేశము - వర్షము, రాష్ట్రము, రాజ్యము, సామ్రాజ్యము, పాళెము, నీవృతము.
ధనము - ఆదాయము, డబ్బు, సొమ్ము, అర్ధము, నగదు, దుడ్డు, ద్రవ్యము, సొత్తు, లెక్క, కాసు, పైకము.
నారదుడు - కలహాశనుడు, త్రిలోకసంచారి, కలహభోజనడు, దేవలుడు, కలహ ప్రియుడు. నేడు - ఈనాడు, ఈప్రొద్దు, ఈరోజు.
పండితుడు - అభిజ్ఞుడు, కవి, కోవిదుడు, ధేమతుడు, విద్వాంసుడు.
పెండ్లి - వివాహము, పాణిగ్రహణము, మనువు, పరిణయము, స్వీకారము, కళ్యాణము.
పన్ను - కష్టము, సుంకము, కూలి, శిస్తు, శుల్కము, ఇల్లరి.
పరిశోధన - విచారించు, పలికించు, సోదించు, అరయు, ఎంచు, ఒరయు.
పరిశోధకుడు - పరీక్షకుడు, శోధకుడు, విచారకుడు, పరిశీలకుడు. 
పర్యాయము - తడవ, అనుకల్పము, ఆవర్తి, ఆవృత్తి, తూరి, దఫా, పరి, పరువడి, పారి, పూపు, మఱి, మాటు, మాఱు, మొగి, రువ్వము, రువ్వు, విడుత, సారి
పాపము - దుష్కృతము, కీడు, కొడిమె, అఘము, కలక, దోషము, దురితము.
పిల్లి - బిడాలము, మార్జాలము, వ్యాఘ్రాదము, త్రిశంకువు.
ప్రాణము - ఓవము, ఉసురు, సత్త్వము, ఊపిరి, అసువులు. 
బాలిక  - అమ్మాయి, అమ్మి, కన్య, కన్యక, కుమారి, కొంజిక, కొండుక, కొమారి, చిన్నది, చిఱుతుక, ధీత, ధీద, నగ్నిక, నివర, పసిగాపు, పాప, పిన్నపాప, పిల్ల, పీపరి, పోఱి, బాల, గుంట, బాలిక, బాలకి, రోహిణి, వాసువు,  త్య్రబ్ద (మూడేండ్ల బాలికను త్య్రబ్ద అని ప్రత్యేకంగా ప్రయోగించే పదం)

బుద్ధి - ప్రతిభ, ప్రజ్ఞ, ప్రాజ్ఞ, ధౌ, ప్రజ్ఞానము, మనీష.
బ్రహ్మ - విధాత, కమలగర్భుడు, చతుర్ముఖుడు, హంసవాహనుడు, చతురాననుడు, కంజాతుడు, కమలాసనుడు, నలువాయి, సృష్టికర్త.
భక్తి - బత్తి, సేవ, ఇమ్ము, విరాళి, సొరత్వము, పోరామి.
భర్త - వల్లభుడు, ప్రాణేశుడు, ఈశుడు, నాధుడు.
భార్య - అర్ధాంగి, సతి, ఆలు, ఇల్లాలు, కళత్రము, పత్ని, గృహిణి.
భోజనము - విందు, భుక్తి కడుపు, అన్నము, ఓగిరము, బోనము, భిక్ష, పబ్బము.
మనస్సు - హృదయము, ఉల్లము, మనము, ఎరచిత్తము, ఎడద, అంతరంగము, డెందము.
మాట - వాక్కు, పలుకునుడి, ఉకిత, వనము, ఆలాపము, సుద్ది, భాషణము.
ముఖము - మూతి, వదనము, మోము.
మెరుపు - సౌదామిని, అంబరాంశువు, నీలాంజన, చంచల, అశని, మేఘవహ్ని.
మేఘము - అబ్దము, వారిదము, పర్జన్యము, నీరదము, జలధరము, పయోధరము.
మేనము - అవాక్కు, అభాషణము.
యముడు - ధర్మరాజు, సమవర్తి కాలుడు, పాశి మృత్యువు, శమనుడు.
యుద్దము - రణము, సంగ్రామము, తగవు, పోరు, సమరము, భండనము, వైరము, విగ్రహము.
రక్షణ - శరణు, త్రాణము, రక్ష, అభయము, కాపుదల.
రహస్యము - గూఢము, గుప్తము, మంతనము, మర్మము, చాటు, గోపనము.
రాత్రి - అసుర, రజని, నిశీధము, నిసి, యామిని, అంజనము, మాలతి.
రైతు - సేద్యకాడు, కుటింబి, కర్షకుడు, హాలికుడు, కృషీవలుడు, కాపు.
రోగము - అనారోగ్యము, జబ్బు, అస్వస్థము, నలత, వ్యాధి, సుస్తి, అపాటము.
వరుస - అంచె, సరణి, దొంతర, క్రిమము, వళబారు, శ్రేణి, బొత్తి, సరళి
వర్తకుడు - వ్యాపారి, వణిజుడు, శ్రేష్ఠి, వ్యాపారస్థుడు, సెట్టి, వ్యవహారి.
వస్త్రము - అంబరము, చేలము, వలువ, కోక, గుడ్డ, శాటి.
వార్త - కబురు, గాద, వర్తమానము, సొద, సంగతి.
విద్యార్ధి - పాధకుడు, అద్యౌత, పాఠనుడు, అభ్యాసి.
విధము - ఒరవు, సొంపు, సూటి, క్రియ, క్రిమము, దారి, వెరవు, మార్గము.
వినోదము - వేడుక, హొయలు, వింత.
విమర్శ - సమీక్ష, పరామర్శ, అవలోకనము, విచారము, చర్చ.
విష్ణువు - శౌరి, హిర్ణగర్భుడు, అనంతుడు, గోవిందుడు, వైకుంఠుడు, చక్రాయుధుడు, పన్నగశయనుడు, జనార్ధనుడు, అక్షరుడు, 
వృద్ధురాలు - జరతి, ఏలిక్ని, మందాకిని, ముదుసలి, ముద్ది, వృద్ధ, అవ్వ
శ్రీనివాసుడు, పద్మగర్భుడు.
వైతాళికుడు - ప్రబోధకుడు, ఉద్బోధకుడు, ఛాత్రికుడు
శపధము - వ్రతము, బిట్టు, బాస, పూనిక, ప్రతిన, పంతము, ప్రతిజ్ఞ
శరీరము - అంగము, బొంది, మేను, విగ్రహము, ఒడలు, దేహము. 
యువతి - ఎలనాగ, కాహళి, కొమరు, చామచిరంటి, జవరాలు, జవ్వని, తరుణి, ధని, పడుచు 
గర్భవతి - అంతరాపత్య, అంతర్గర్భ, ఉదరిణి, గర్భిణి, చూలాలు, దౌహృదిని, నిండు మనిషి, భ్రూణ, సనత్త్వ, సూష్యతి, వ్రేకటిమనిషి 
బాలెంతరాలు - జాతాపత్య, నవప్రసూత, పురుటాలు, పురుటియాలు, ప్రజాత, ప్రసూత, ప్రసూతిక, బాలెంత, బిడ్డతల్లి, సూతక, సూతి
    తనయుడు = కొడుకు, పుత్రుడు, సుతుడు
    తరువు = చెట్టు, వృక్షము, మహీరుహము
    జలధి = కడలి, అర్ణవము, సముద్రము
    పర్వం = పబ్బం, పండుగ, వేడుక
    శత్రువు = వైరి, రిపు, విరోధి
    ఆంజనేయుడు = పవనసుతుడు, మారుతి, హనుమంతుడు
    నిజము = సత్యము, నిక్కము
    తల = శిరస్సు, మస్తకము, మూర్ధము
    స్త్రీ = వనిత, మహిళ, పడతి, అంగన, అంచయాన, అంబుజలోచన, అంబుజవదన, అంబుజాక్షి, అంబుజానన, అంబురుహాక్షి, అక్క, అతివ, అన్ను, అన్నువ, అన్నువు, అబల, అబ్జనయన, అబ్జముఖి, అలరుబోడి, అలివేణి, ఆడది, ఆడకూతురు, ఇంతి, ఇందీవరాక్షి, ఇందునిభ్యాస, ఇందుముఖి, ఇందువదన, ఇగురుబోడి, ఇభయాన, ఉగ్మలి, ఉవిద, ఉజ్జ్వలాంగి, ఎలనాగ, ఏతుల, కంజముఖి, కంబుకంఠి, కనకాంగి, కమలాక్షి, కలకంఠి, కలశస్తని, కలికి, కాంత, కువలయాక్షి, కేశిని, కొమ్మ, కోమలి, కోమలాంగి, చంద్రముఖి, చంద్రవదన, చక్కనమ్మ, చాన, చామ, చారులోచన, చిగురుబోడి, చిలుకలకొలికి, చెలువ, చేడె, తన్వంగి, తన్వి, తమ్మికంటి, తరళేక్షణ, తరుణి, తలిరుబోడి, తలోదరి, తొయ్యలి, తోయజాక్షి, దుండి, ననబోడి, నళినాక్షి, నవలా, నాతి, నారి, నీరజాక్షి, నీలవేణి, నెలత, నెలతుక, పంకజాక్షి, పడతి, పడతుక, పల్లవాధర, పాటలగంధి, పుత్తడిబొమ్మ, పూబోడి, పైదలి, పొలతుక, ప్రమద, ప్రియ, బింబాధర, బింబోష్టి, బోటి, భామ, మగువ, మహిళ, మదిరాక్షి, మానిని, మానవతి, ముగుద, ముదిత, ముద్దుగొమ్మ, మెలత, యోష, రమణి, రూపసి, లతాంగి, లలన, లేమ, వనిత, వలజ, వారిజనేత్రి, వాల్గంటి, విరబోడి, విశాలాక్షి, వెలది, శంపాంగి, శాతోదరి, సుందరి, సుగాత్రి, సుదతి, సునయన, హంసయాన, హరిణలోచన
    జైలు = కారాగారం, బందిఖానా, చెరసాల

Comments

Post a Comment

Popular posts from this blog

వ్యతిరేక పదాలు