ప్రాస పదాలు

ప్రాస పదాలు

పాప గిలక
తాత పిలక

అమ్మ మాట
అక్క పాట

టక్కరి కొక్కెర
చక్కని ముక్కెర

సబ్బు మరక
గడ్డి పరక

గుడి గంట
వరి పంట

రంగు పలక
కంటి నలక

పళ్ళ గంప
ముళ్ళ కంప

పిచ్చి కుక్క
పూల మొక్క

చిట్టి తల్లి
బుజ్జి చెల్లి

కాకి ఈక
మేక తోక

తేలు కొండి
రైలు బండి

బావి గట్టు
రావి చెట్టు

దోస పండు
పూల చెండు

పట్టు కుచ్చు
గొర్రె బొచ్చు

గండు పిల్లి
బొడ్డు మల్లి

చీల మండ
గోల కొండ

వెండి కొండ
నిండు కుండ

ఆల మంద
తీయ కంద

వరి అన్నం
రాతి సున్నం

నీటి బుడుగ
పాము పడగ

ప్రాస వాక్యాలు

మంచి మాట ముద్దు
కల్లలాడవద్దు

కీడు చేయ ముప్పు
వాదులాడ తప్పు

కట్టు లేని నోరు
గట్టు తెగిన ఏరు

పెద్ద వారి మాట
పెరుగన్నం మూట

కలసి మెలసి మెలుగు
కలిమి బలిమి కలుగు

పొల్లుమాట విడువు
గట్టిమాట నుడుపు

మాట తప్పబోకు
మంచి విడువబోకు

అడుసు తొక్కుటేల?
కాలు కడుగు టేల?

చదువురాని మొద్దు
కదలలేని ఎద్దు

కీడుచేయ ముప్పు
వాదులాడ తప్పు

మంచివిద్య చదువు
మంచిబుద్ధులొదవు

గట్టిమాట నుడువు
గర్వమంత విడువు

ప్రియములేని విందు
నయముకాని మందు

పోరునష్టం పొందులాభం
కలసి ఉంటే కలదు సుఖం

Comments

Popular posts from this blog

పర్యాయ పదాలు.

వ్యతిరేక పదాలు