తెలుగు కథపై వెలుగు సంతకం
తెలుగు కథను ఆత్మీయంగా గుండెలకు హత్తుకునేవారందరూ పాలగుమ్మి పద్మరాజును కూడా అభిమానిస్తారు. కథ అంటే ఎలా ఉండాలి, పాత్రలు, వాటి సంభాషణలు, కథా శిల్పం, నడక, ప్రారంభం, సన్నివేశాలు, మలుపులు, ముగింపు వీటన్నింటిని మనం వీరి కథల్లో నిశితంగా పరిశీలించవచ్చు.కథ చదివి వదిలేసినా మనం దాన్నించి తప్పించుకోలేం. అది వెంటాడుతుంటుంది. వేధిస్తుంది. వేటాడుతుంది. కొత్త స్థితి మనం అనుభవిస్తాం. కోల్పోయిన మానవీయ విలువల్ని అన్వేషిస్తాం. హృదయాన్ని తెరచి చూసుకుని గాయాలకు లేపనాల్ని స్పర్శిస్తాం. సంబంధాలు, అనుబంధాలు వీటన్నింటినుంచి దూరంగా ‘గాలీ వాన’కు కొట్టుకు పోకుండా ఏదైనా ఒక ఆధారం దొరికితే బాగుండునని కాసేపు దిగులు పడతాం. ఈ విలువలన్నీ పద్మరాజు కథలకు ఉన్నాయి.
http://www.suryaa.com/main/showLiterature.asp?cat=6&subCat=1&ContentId=32986
Comments
Post a Comment